7న పెదపూడిలో ప్రజాగళం
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:53 AM
పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపూడిలో ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం ప్రజాగళం సభను నిర్వహిస్తున్నామని టీడీపీ అధి నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, విజయవంతం చేయాలని ఆ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, పొలిట్‌బ్యూర్ సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
విజయవంతం చేయాలని టీడీపీ కృష్ణాజిల్లా నేతల పిలుపు
కూచిపూడి, మార్చి 2: పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపూడిలో ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం ప్రజాగళం సభను నిర్వహిస్తున్నామని టీడీపీ అధి నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, విజయవంతం చేయాలని ఆ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, పొలిట్‌బ్యూర్ సభ్యుడు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. శనివారం సభ నిర్వహించే ప్రాంతాన్ని వారు పరిశీలిం చారు. పార్టీలకతీతకంగా తటస్థుల సమస్యలను చంద్రబాబు తెలుసుకుంటారని, అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించడానికే ఈసభ నిర్వహిస్తున్నామని కొన కళ్ల నారాయణ తెలిపారు. ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, స్ర్తీలు పడుతున్న ఇబ్బందులు, అన్నివర్గాల సమస్యలు తెలుసుకుని వాటిని చంద్రబాబుకు వివరిస్తామని తెలిపారు. కొంతమందితో నేరుగా చంద్రబాబు ముచ్చటి స్తారన్నారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సభలో టీడీపీ- జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటించినట్లు పేర్కొన్నారు. పామర్రు, గుడివాడ, పెడన, బందరుతోపాటు పక్క నియోజకవర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 6వేల మంది ప్రతినిధులతో సభ నిర్వహిస్తున్నామని రవీంద్ర తెలిపారు. ప్రజాగళం సభ విజయవంతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా కోరారు. నన్నపనేని వీరేంద్ర, లింగమనేని రామలింగేశ్వర రావు, తలశిల స్వర్ణలత పాల్గొన్నారు.