Pawan Kalyan: నేడు సచివాలయానికి రానున్న పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:25 AM
అమరావతి: జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతికి రానున్నారు. అమరావతి రైతులకు మొదటి నుంచి జనసేనాని అండగా ఉన్నారు.
అమరావతి: జనసేన అధినేత (Janasena Chief) , ఏపీ డిప్యూటీ సీఎం (AP Dypt. CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి (Amaravati)కి రానున్నారు. అమరావతి రైతులకు (Farmers) మొదటి నుంచి జనసేనాని అండగా ఉన్నారు. ఆనాడు అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి పోలీసుల ఇనుప కంచెలను దాటుకుని, కాలినడకన పవన్ అమరావతికి వచ్చారు. రైతుల వార్షిక కౌలు, అసైన్డ్ రైతుల సమస్యల పరిష్కారానికి అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ తొలిసారిగా ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సీడ్ ఆక్సిస్ రోడ్ మొదలుకొని వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తుళ్ళూరు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బారీ వర్షం దృశ్యాలు..
ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..
అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు
కోడెల చేస్తే తప్పు.. జగన్ చేస్తే ఒప్పా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News