Share News

యోగా మార్గంతో శాంతి, సౌభాగ్యాలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:27 AM

ప్రజాపిత బ్రహ్మకుమారి యోగమార్గం అనుసరించడం ద్వారా శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయని వరంగల్‌, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల రీజనల్‌ ఇన్‌ఛార్జి రాజయోగిని బ్రహ్మకుమారి సవిత అన్నారు.

యోగా మార్గంతో శాంతి, సౌభాగ్యాలు
జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభిస్తున్న బ్రహ్మకుమారీలు

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపిత బ్రహ్మకుమారి యోగమార్గం అనుసరించడం ద్వారా శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయని వరంగల్‌, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల రీజనల్‌ ఇన్‌ఛార్జి రాజయోగిని బ్రహ్మకుమారి సవిత అన్నారు. మచిలీపట్నం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖ 40వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సుమ కన్వెన్షన్‌ హాలులో జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల బ్రహ్మకుమారిలు, యోగసాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయోగిని బ్రహ్మకుమారి సవిత మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ఎంత ధనమున్నా శాంతికి దూరంగా ఉన్నారన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో నేర్పే యోగసాధన వల్ల మానవాళికి శాంతియుత జీవనం చేకూరుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వందలాది శాఖల్లో నిర్వహిస్తున్న ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి రోజూ రాజయోగాన్ని బోధిస్తున్నారన్నారు. ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులతో పాటు వ్యాపారులు, విద్యావేత్తలు రాజయోగాన్ని అభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుకుమారి శాంతతో పాటు సుధాకరమూర్తి తదితరులు ప్రసంగించారు. కేకులు కట్‌ చేశారు. ఈ సత్సంగంలో ధ్యాన మార్గంపై పలువురు ప్రసంగించారు.

Updated Date - Nov 18 , 2024 | 12:27 AM