వరదలకు తెగిన పైపులైను.. అరకొరగా తాగు, సాగునీరు
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:48 AM
వరదల కారణంగా గుం టూరు జిల్లా రాజు కాల్వ- ఎదురుమొండి ఎత్తి పోతల పథకం ద్వారా కృష్ణానది మీదుగా ఎదురు మొండి చెరువుకు వచ్చే రెండు పైపులైన్లలో ఒక పైపులైన్ తెగిపోయిందని గ్రామ పెద్దలు తెలిపారు.
నాగాయలంక: వరదల కారణంగా గుం టూరు జిల్లా రాజు కాల్వ- ఎదురుమొండి ఎత్తి పోతల పథకం ద్వారా కృష్ణానది మీదుగా ఎదురు మొండి చెరువుకు వచ్చే రెండు పైపులైన్లలో ఒక పైపులైన్ తెగిపోయిందని గ్రామ పెద్దలు కొక్కిలి గడ్డ శ్రీనివాసరావు, లంకేశ్వరరావు, మోకా శివ శ్రీనివాసరావు, చెన్ను వెంకటేశ్వరరావు తెలిపారు. రాజు కాల్వ-ఎదురుమొండి ఎత్తిపోతల పథకం ద్వారా ఎదురుమొండి చెరువుకు వచ్చిన నీరుతో ఎదరుమొండి, నాచుగుంట గ్రామాల రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందుతోందని, రెండు గ్రామాల్లో 1300 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారని, ఎనిమిది వేల మందికి తాగునీరు అందుతోం దని, ఒక పైపులైన్ తెగిపోవటంతో ఒక పైపులైను నుంచే ప్రస్తుతం నీరు వస్తోందని సాగు, తాగునీరు అరకొరగా అందుతుందని తక్షణమే పైపులైను పునరుద్ధరించాలని వారు కోరారు.