వైసీపీకి తొత్తులుగా పోలీసులు
ABN , Publish Date - Mar 08 , 2024 | 01:09 AM
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేయడం దుర్మార్గం. పోలీసులు వైసీపీకి పని చేస్తున్నారా లేక రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం పని చేస్తున్నారా? అని జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా ప్రశ్నిం చారు.
అలా వ్యవహరించడం దుర్మార్గం: ముప్పా రాజా
కంకిపాడు, మార్చి 7: ‘‘జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలీసులు దౌర్జన్యం చేసి ఎటువంటి ఆర్డర్స్ లేకుండా సోదాలు చేసి, రివాల్వర్ చూపించారు. ఇలా చేయడం సరికాదు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేయడం దుర్మార్గం. పోలీసులు వైసీపీకి పని చేస్తున్నారా లేక రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం పని చేస్తున్నారా?’’ అని జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా ప్రశ్నిం చారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లా డారు. నెలలో అధికారం కోల్పోయే పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.