Share News

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:46 AM

ధర్నాచౌక్‌లో శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.

 సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

విద్యార్థుల సమస్యలపై సీఎం స్పందించాలి: ఏఐఎస్‌ఎఫ్‌

ధర్నాచౌక్‌, సెప్టెంబరు 20: ‘‘రాష్ట్రవాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్భా హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. సమస్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలి.’’ అని ఏఐ ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్‌బాబు, శివారెడ్డి డిమాండ్‌ చేశా రు. ధర్నాచౌక్‌లో శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ‘‘ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను తక్షణమే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 వార్డెన్‌, కుక్‌, కామా టి, వాచ్‌మెన్‌, అటెండర్‌ పోస్టులను భర్తీ చేయాలి. శిథిలావస్ధకు చేరిన వసతిగృహాల మరమ్మతులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి. బాలికల రక్ష ణకు ప్రతీ హాస్టల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను రూ.2500లకు పెంచాలి. వచ్చే బడ్జెట్‌లో సాం ఘిక సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలి. విద్యార్థులకు న్యాయం చేయకుంటే భారీగా విద్యార్థులను సమీకరించి పోరా టాన్ని ఉధృతం చేస్తాం.’’అని నాయకులు హెచ్చరించారు. న్యాయవాది చల సాని అజయ్‌కుమార్‌ దీక్షను ప్రారంభించారు. ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఐఏఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, నాజర్‌ జి, సహాయ కార్యదర్శులు మస్తా న్‌షరీఫ్‌, షాబీర్‌ బాషా, రాష్ట్ర కోశాధికారి సాయికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:46 AM