AP Govt: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ షురూ
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:12 AM
Andhrapradesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు.
అమరావతి, నవంబర్ 20: కర్నూలులో హైకోర్ట్ (High Court) బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్కార్ (AP Govt) పేర్కొంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయంలో అయోమయం
రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్‌లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటు చేశారని అధికారులు గుర్తుచేశారు. రాయలసీమ రీజియన్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. హైకోర్ట్‌లో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో రెండు లేదా మూడు ఏళ్ల కంటే పెండింగ్‌లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరారు.
ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేసి గెలవాలి
ఇటీవల న్యాయశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు, మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలుచేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
పలు రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్‌లు ఇవే...
ఇండియాలో కొన్ని రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన హైకోర్టు స్థానంతో పాటు ఇతర నగరాల్లో బెంచ్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు మరియు ఆయా హైకోర్టు బెంచ్‌లు ఈ విధంగా ఉన్నాయి:
1. మహారాష్ట్ర -
• హైకోర్టు ప్రధాన స్థానం: ముంబై
• బెంచ్‌లు: నాగ్‌పూర్, ఔరంగాబాద్, గోవా (పనాజీ)
2. ఉత్తరప్రదేశ్ -
• హైకోర్టు ప్రధాన స్థానం: అలహాబాద్
• బెంచ్‌లు: లఖ్‌నవూ
3. మధ్యప్రదేశ్ -
• హైకోర్టు ప్రధాన స్థానం: జబల్‌పూర్
• బెంచ్‌లు: ఇండోర్, గ్వాలియర్
4. రాజస్థాన్ -
• హైకోర్టు ప్రధాన స్థానం: జోధ్‌పూర్
• బెంచ్: జైపూర్
5. కర్ణాటక -
• హైకోర్టు ప్రధాన స్థానం: బెంగుళూరు
• బెంచ్: ధార్వాడ-దర్వాడ
• బెంచ్: కాళబురిగి
6. తమిళనాడు -
• హైకోర్టు ప్రధాన స్థానం: చెన్నై
• బెంచ్: మధురై
7. ఉత్తరాఖండ్ -
• హైకోర్టు ప్రధాన స్థానం: నైనిటాల్
• బెంచ్: హల్ద్వానీ (ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నా, ఇంకా అమలులో లేదు)
8. జార్ఖండ్ -
• హైకోర్టు ప్రధాన స్థానం: రాంచీ
• బెంచ్: దుమ్కా (ప్రస్తుతానికి ప్రతిపాదనలో ఉంది)
గౌహతి హైకోర్టు: అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఉంది. అయితే, బెంచ్‌లు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.
బెంచ్‌లు: గౌహతి ప్రధాన బెంచ్ అస్సాంలోని గౌహతిలో ఉంది. ఐజ్వాల్(స్టేట్ ఆఫ్ మిజోరం), కోహిమా(స్టేట్ ఆఫ్ నాగాలాండ్), ఇటానగర్(స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్)
ఇవి కాకుండా కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి, అయితే వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి...
రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్
Read Latest AP News And Telugu News