Share News

బందరు తహసీల్దార్‌, ఏఆర్వో సతీష్‌ను కౌంటింగ్‌ విధుల నుంచి తప్పించండి

ABN , Publish Date - May 26 , 2024 | 12:51 AM

మచిలీపట్నం తహ సీల్దార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సతీష్‌..కలెక్టరు ఉత్త ర్వులను లక్ష్య పెట్టకుండా సొంత శాఖకు పంపిన డిప్యూటీ తహసీల్దార్‌ వన జాక్షిని విధుల్లో కొనసాగిస్తు న్నారు.

బందరు తహసీల్దార్‌, ఏఆర్వో సతీష్‌ను  కౌంటింగ్‌ విధుల నుంచి తప్పించండి
ఆర్డీవో కార్యాలయంలో ఏవో లక్ష్మికి వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకుడు ఇమిడాబత్తుల దిలీప్‌కుమార్‌

ఆయన వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు

డీటీ వనజాక్షిని సొంతశాఖకు పంపమని కలెక్టర్‌ ఆదేశించారు

అయినా తహసీల్దార్‌ కార్యాలయంలోనే కొనసాగిస్తున్నారు

ఆర్డీవో, మచిలీపట్నం ఆర్వో ఎం.వాణికి టీడీపీ ఫిర్యాదు

మచిలీపట్నం టౌన్‌, మే 25: మచిలీపట్నం తహ సీల్దార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సతీష్‌..కలెక్టరు ఉత్త ర్వులను లక్ష్య పెట్టకుండా సొంత శాఖకు పంపిన డిప్యూటీ తహసీల్దార్‌ వన జాక్షిని విధుల్లో కొనసాగిస్తు న్నారు. ఆయన వైసీపీ నాయ కులకు కొమ్ముకాస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ నుంచి ఆయనను తప్పించండి.’’ అని ఆర్డీవో, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎం.వాణికి శనివారం టీడీపీ నాయకుడు ఇమిడాబత్తుల దిలీప్‌కుమార్‌ వినతిపత్రం పంపారు. ఆర్డీవో వాణి కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉండటంతో కార్యాలయ ఏవో లక్ష్మికి దిలీప్‌కుమార్‌ వినతి పత్రం అందించారు. దొంగపట్టాలు జారీ చేస్తున్నారంటూ రెండు నెలల క్రితం టీడీపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసిన సందర్భంగా సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయంలో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వనజాక్షిని సొంత శాఖకు పంపాలని కలెక్టర్‌ డీకే బాలాజీ ఉత్త ర్వులు జారీ చేశారన్నారు. ఏప్రిల్‌ 14న ఇచ్చిన ఆ ఉత్తర్వులను తహసీల్దార్‌ అమలు చేయకుండా తహసీల్దార్‌ కార్యాలయంలోనే వనజాక్షిని కొనసాగిస్తూ వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమ న్నారు. ఎమ్మెల్యేకు పీఏగా డిప్యూటేషన్‌పై వెళ్లిన రఘురామ్‌ను మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయానికి డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సతీష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆర్డీవోను దిలీప్‌ కుమార్‌ కోరారు.

Updated Date - May 26 , 2024 | 12:51 AM