రోడ్ల నిర్మాణానికి రూ.5.34 కోట్లు: ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:00 AM
రానున్న సంక్రాంతి లోపు గోతులు లేని రహదారుల నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు.
పామర్రు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ‘నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణానికి రూ.5.34 కోట్లు మంజూరయ్యాయి. రానున్న సంక్రాంతి లోపు గోతులు లేని రహదారుల నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా, ప్రజా సేవకుడిగా పని చేసిన నారా రామ్మూర్తినాయుడు అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.