రైతుబజార్ల ఘనత టీడీపీదే
ABN , Publish Date - Oct 10 , 2024 | 01:14 AM
దళారీ వ్యవస్థకు తావులేకుండా పంటలు పండించే రైతులే స్వయం గా తమ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించుకొనేందుకు రైతుబజార్లను ప్రారంభించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కానూరు బందరు రోడ్డుపై వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఎదురు బందరుకాల్వ ఇరిగేషన్ స్థలంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను ప్రారంభించారు.
పెనమలూరు, అక్టోబరు 9 : దళారీ వ్యవస్థకు తావులేకుండా పంటలు పండించే రైతులే స్వయం గా తమ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించుకొనేందుకు రైతుబజార్లను ప్రారంభించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కానూరు బందరు రోడ్డుపై వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఎదురు బందరుకాల్వ ఇరిగేషన్ స్థలంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు బజార్లను వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర మంత్రిగా ఉన్నపుడు రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కరోనా సమయంలో కళాశాల లోపల ఉన్న రైతుబజార్‌ను ఇప్పుడు ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలి పారు. స్థానిక ప్రజలు ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుబజార్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపల్ కమిషనర్ భవానీప్రసాద్, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, మారుపూడి ధనకోటేశ్వరరావు, అంగిరేకుల మురళి, పీతా గోపీచంద్, నర్రా చంటి, రాంకుమార్, సాంబశివ, సాదిక్, మేడసాని రత్నకుమారి, బర్మా శ్రీనివాస్, చాణక్య, నాగుర్‌మీరా, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కంకిపాడు : ప్రజలకు ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ అధికారులు అందుబాటులో ఉంటూ మెరుగైన పాలన అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పం చాయతీ ఉప సర్పంచులు, సభ్యులు, అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజ లకు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు అందు బాటులో ఉండాలన్నారు. చిన్న చిన్న కమీషన్లకు కక్కుర్తిపడి పంచాయతీ ఆదా యానికి గండి కొట్టద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, ఎంపీడీవో అనూష, తదితరులు పాల్గొన్నారు.