రైతు సమస్యల పరిష్కారానికే సదస్సులు
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:05 AM
రైతుల సమస్యలు పరిష్కరిం చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్ కేవీ శివయ్య అన్నారు. మండలంలోని రామచంద్రాపురంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 1, అడంగల్ కరక్షన్ కోసం 1, 22ఎ సమస్య కోసం 4, సబ్ డివిజన్ చేయాలని ఒక అర్జీ ఇచ్చారు.
గన్నవరం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రైతుల సమస్యలు పరిష్కరిం చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్ కేవీ శివయ్య అన్నారు. మండలంలోని రామచంద్రాపురంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 1, అడంగల్ కరక్షన్ కోసం 1, 22ఎ సమస్య కోసం 4, సబ్ డివిజన్ చేయాలని ఒక అర్జీ ఇచ్చారు. ఈ సం దర్భంగా జరిగిన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ, రైతుల దగ్గరకే రెవెన్యూ యం త్రాంగాన్ని ప్రభుత్వం పంపి భూ సమస్యలు పరిష్కరించేలా చేస్తుందన్నారు. రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచ్ ఈలప్రోలు శ్రీనివాసరావు, వీఆర్వో నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
వేంపాడు, చాగంటిపాడులో..
ఉంగుటూరు : భూములకు సంబంధించి అనేక రకాల పౌర సేవలతోపాటు ప్ర భుత్వ పథకాలకు అవసరమైన పలురకాల ధ్రువీకరణపత్రాలు ఉచితంగా అందిం చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జాలాది విమలకుమారి అన్నారు. రెవెన్యూ, ఇతర అనుబంధశాఖల అధ్వర్యంలో మండలంలోని వేంపాడు, చాగంటిపాడు గ్రామాల్లో శుక్రవారం మీభూమి, మీహక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగనబోయిన శివనాగబాబు, అప్పికట్ల లక్ష్మీఅనూష, ఆర్‌ఐ బి.సూర్యకాంతి, వీఆర్వో ఆర్.పిచ్చయ్య పాల్గొన్నారు.