Share News

దుర్గగుడిలో సహస్రలింగార్చన

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:05 AM

కార్తీకమాసాన్ని పుర స్కరించుకుని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సహస్ర లింగార్చన చేశారు.

దుర్గగుడిలో సహస్రలింగార్చన
సహస్రలింగార్చన చేస్తున్న పండితులు

వన్‌టౌన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసాన్ని పుర స్కరించుకుని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సహస్ర లింగార్చన చేశారు. మల్లేశ్వరస్వామి సన్నిధిలో సహస్రలింగాలకు అభి షేకం, బిల్వార్చన, పుష్పార్చన చేశారు. సాయంత్రం సమయంలో సహ స్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఊంజల్‌ సేవతో మిళితం చేసి భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆకాశదీపాన్ని వెలిగించి ధ్వజారోహణం చే శారు. సకల జనుల ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ అందరికీ శుభాలు కలగాలని కోరుతూ దుర్గగుడిలో అర్చకులు, వేదపండితులు సూర్యో పాసన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరుణ పారాయణ, సూర్య మంత్ర జపం నిర్వహించి స్వామికి తర్పణ చేశారు.

అన్నవితరణకు రూ.లక్ష వితరణ

దుర్గగుడిలో అన్న విత రణకు హైదరాబాద్‌, మణికొండకు చెందిన సట్లూరి కావ్య, రాఘవేంద్ర ఈవో కె.ఎస్‌.రామారావు ద్వారా రూ.లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో దేవస్థానానికి అందజేశారు.

కళావేదిక పై మహా సత్సంగం

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సభ్యులు ఆదివారం మహా సత్సంగం పేరున వన్‌ టౌన్‌లోని వీఽధుల్లో భజన చేసుకుంటూ బ్రాహ్మణ వీధి నుంచి కనక దుర్గానగర్‌కు, అక్కడ నుంచి ఆలయానికి పాదయాత్రగా వచ్చారు. అనంతరం కళావేదికపై శివ భజనలు, ఇతర భక్తి కీర్తనలు ఆలపిం చారు. శివభజనల పాటలకు భక్తులు హర్షధ్వానాలు చేశారు. బృందా నికి ఏఈవో సుధారాణి అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 01:05 AM