Share News

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:51 AM

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని జనసేన నేత గరికపాటి శివశంకర్‌ అన్నారు. తిరు మల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతకు నిరసనగా ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మంగళవారం శివశంకర్‌ హనుమాన్‌ జంక్షన్‌ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాద యాత్ర నిర్వహించారు.

 సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి
శివశంకర్‌ పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న వీరవల్లి నేతలు

హనుమాన్‌జంక్షన్‌/ రూరల్‌, అక్టోబరు 1 : సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని జనసేన నేత గరికపాటి శివశంకర్‌ అన్నారు. తిరు మల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతకు నిరసనగా ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మంగళవారం శివశంకర్‌ హనుమాన్‌ జంక్షన్‌ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాద యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమరసత ఫౌండేషన్‌ నాయ కులు ఎదురువాడ శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్‌ మాతృశక్తి విభాగం జిల్లా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, జనసేన నాయకులు మూర్తి ఆయన వెంట ఉన్నారు.

వీరవల్లిలో..

సనాతన ధర్మపరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రవర్తిస్తే మంచిదని జనసేన నేత గరికపాటి శివశంకర్‌ అన్నారు. వీరవల్లిలో తిరుపతమ్మ దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు లంక సురేంద్ర మోహన బెనర్జీ, ఉపసర్పంచ్‌ అజయ్‌కుమార్‌, గుండపనేని ఉమావరప్రసాద్‌, మండాది రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:51 AM