పిచ్చుకలను కాపాడుకోవడం మన బాధ్యత
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:24 AM
జీవ వైవిధ్యం కాపాడు కోవాలంటే పిచ్చుకలను కూడా మనం కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలని, యువతరం ఇది ఒక ఉద్యమంగా చేపట్టాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, హరిత వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పోలుపర్తి దాలినాయుడు చెప్పారు.
పిచ్చుకలను కాపాడుకోవడం
మన బాధ్యత
పోలుపర్తి దాలినాయుడు
మొగల్రాజపురం, ఏప్రిల్ 26: జీవ వైవిధ్యం కాపాడు కోవాలంటే పిచ్చుకలను కూడా మనం కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలని, యువతరం ఇది ఒక ఉద్యమంగా చేపట్టాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, హరిత వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పోలుపర్తి దాలినాయుడు చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్ర వారం పిచ్చుకల సంరక్షణ కోసం అవగాహనా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరీకరణ వల్ల పిచ్చుకలు కనుమరుగ వుతున్నాయని ఇది పర్యావరణానికి చాలా హాని చేస్తుందన్నారు. కనుక పిచ్చుకలను కాపాడుకోవాలని, వాటికి ఆహారాన్ని అందించే ఏర్పాటు ఇళ్లలో చేయాలని సూచించారు. పక్షుల వల్ల ప్రకృతి సమతుల్యత ఉంటుందన్నారు. ఇందు కోసం వరికంకులను ఇళ్లలో ఎలా ఏర్పాటు చేయాలో చూపించారు. కళాశాల సరస్వతీ మందిరంలో, ఉద్యానవనంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాకర్ మేకా రమేష్, డైరెక్టర్ వే మూరి బాబురావు, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాసరావు, అధ్యాపకులు డాక్టర్ సాంబానాయక్, శ్రావణి, శిరీష, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.