డంపింగ్ యార్డులో స్వల్ప మంటలు
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:16 AM
మున్సిపల్ డంపింగ్ యార్డులో బుధవారం స్వల్పంగా మంటలు చెలరేగి పొగ కమ్మడంతో స్థానికుల ఫిర్యాదుపై మున్సిపల్ అధికారుల వెంటనే స్పందించారు.
వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది.. అదుపులోకి మంటలు
గుడివాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ డంపింగ్ యార్డులో బుధవారం స్వల్పంగా మంటలు చెలరేగి పొగ కమ్మడంతో స్థానికుల ఫిర్యాదుపై మున్సిపల్ అధికారుల వెంటనే స్పందించారు. మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివా సరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ పి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మున్సి పల్ నీటి ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, శానిటేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.