ఘనంగా అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 AM
ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో మంగళవారం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఘనంగా అంతర్జాతీయ
బాలల పుస్తక దినోత్సవం
గవర్నర్‌పేట, ఏప్రిల్ 2: ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో మంగళవారం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులచే పుస్తకాలు చదివించే కార్యక్రమం నిర్వహించారు. పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన గ్రంథపాలకురాలు రమాదేవి మాట్లాడుతూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని చిన్నారులకు సూచించారు. మంచి పుస్తకం చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.