Share News

కామన్‌ సైట్‌ రెగ్యులరైజేషన్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:36 AM

ఏపీఐఐసీ కాలనీవాసుల కామన్‌ సైట్‌ రెగ్యులరైౖజేషన్‌ సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్‌ హామీ ఇచ్చారు.

కామన్‌ సైట్‌ రెగ్యులరైజేషన్‌ సమస్య పరిష్కారానికి చర్యలు
సమప్యను ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజుకు వివరిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

కామన్‌ సైట్‌ రెగ్యులరైజేషన్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

ఏపీఐఐసీ కాలనీవాసులకు ఎంపీ కేశినేని చిన్ని హామీ

భారతీనగర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీఐఐసీ కాలనీవాసుల కామన్‌ సైట్‌ రెగ్యులరైౖజేషన్‌ సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్‌ హామీ ఇచ్చారు. తూర్పు పరిధి నాల్గవ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజుతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌లోని చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు, పనిచేసేవారు స్థలాన్ని కొనుగోలు చేసి చిన్నపాటి ఇళ్లను నిర్మాణం చేసుకున్నారని, స్థలంలో ఉన్న ఇంటికి రిజిస్ట్రేషన్‌ చేశారని, కామన్‌ సైటుకు రిజిస్ట్రేషన్‌ చేయలేదన్నారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించి కాలనీ వాసులకు న్యాయం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ ఈ కాలనీ 50ఏళ్ల క్రితం ఏర్పడిన లే -అవుట్‌ అన్నారు. ఇక్కడ ఉన్న పదెకరాల స్థలానికి 405 కుంటుబాలు డబ్బులు సమకూర్చుకుని ప్రభుత్వానికి చెల్లించారన్నారు. నిర్మాణం చేసిన స్థలాన్ని మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేశారని, కామన్‌ సైటుకు చేయలేదన్నారు. దాని వల్ల ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్నా, ఇంటిని పడగొట్టి మళ్లీ నిర్మించాలనుకున్నా సాధ్యం కావడంలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజును స్వయంగా వచ్చి పరిశీలించమని కోరడంతో ఆయన వెంటనే వచ్చారన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ ఈ కాలనీలో ఉన్న కామన్‌ సైట్‌ రెగ్యులరైజేషన్‌ సమస్యను త్వరలోని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్‌, ఐలా మాజీ చైర్మన్‌ సుంకర దుర్గా ప్రసాద్‌, టీడీపీ యువనాయకులు గద్దె క్రాంతికుమార్‌, టీడీపీ నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, పాతూరి సాంబశివరావు, కోడూరు ఆంజ నేయవాసు, రెడ్డి రాంబాబు, అబ్థుల్‌ కలాం, జీ .అయ్యప్పరెడ్డి, మన్యం పోతు రాజు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ బాజ్జి, ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ కే. సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:37 AM