స్వైర విహారం
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:53 AM
గ్రామాల్లో కుక్కలు, కోతులు స్వైర విహా రం చేస్తున్నాయి.
కోతులు, కుక్కల నుంచి రక్షించాలని అధికారులకు ప్రజల వినతి
(ఆంధ్రజ్యోతి-కంచికచర్ల): గ్రామాల్లో కుక్కలు, కోతులు స్వైర విహా రం చేస్తున్నాయి. కుక్కలు చిన్న పిల్లలనే కాదు, పెద్దలనూ వెంటపడి కరు స్తున్నాయి. కోతులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ, ఇళ్లల్లోకి చొరబడు తున్నాయి. తిండి కోసం ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి. మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. పెద్దవాళ్లు కర్రలతో బెదిరిస్తున్నా జంకడం లేదు. మందలుగా మనుషుల మీదకు దూకుతున్నాయి. ఇదివరకు బాణా సంచా కాల్చగానే భయపడి పారిపోయేవి. ఇప్పుడు వాటికీ బెదరటం లేదు. ఇళ్ల ముందు పూలకుండీలు, విద్యుత్‌దీపాలు, విలువైన వస్తువులను పగుల గొడుతున్నాయి. కోతుల బాధలు పడలేక తలుపులు వేసుకోవాల్సి వస్తోం దని ప్రజలు వాపోతున్నారు. వీరులపాడు మండలంలో దొడ్డదేవరపాడు, జయంతి, వీరులపాడు, పల్లెంపలి, కంచికచర్ల మండలం గొట్టుముక్కల, నరసింహారావుపాలెం గ్రామాల్లో కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి. నలుగురైదుగురు కలిసి శబ్ధాలు చేస్తూ, కర్రలతో అదిలిస్తున్నప్పటికీ కోతు లు పారిపోవటం లేదని, ఎదురుతిరిగి దాడి చేస్తున్నాయని రైతులు చెబు తున్నారు. గ్రామాల్లో ఇదివరకు పంచాయతీ అధికారులు, వీధి కుక్కలను సం హరించేవారు. బలవంతంగా చంపడాన్ని వ్యతిరే కిస్తూ బ్లూక్రాస్‌తో పాటుగా పలు జంతు సంరక్షణ సంస్థలు కోర్టుకు వెళ్లాయి. దీంతో ప్రస్తుతం కుక్క లను సంహరించటం లేదు. ప్రత్యుత్పత్తి జరగకుండా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. పిల్లలతో పాటుగా పెద్దలనూ వెంటాడి కరుస్తున్నాయి. పశువుల దూడలను గాయ పరుస్తున్నాయి.
గనిఆత్కూరులో కుక్కల గుంపులు
గనిఆత్కూరులో పరిస్థితి దారుణంగా ఉంది. నలుగురైదుగురు కలిసి వెళుతున్నప్పటికీ కుక్కలు వెంటపడుతున్నాయి. గ్రామంలో గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపే పరిస్థితి లేదు.
- మూరకొండ ఏడుకొండలు, గనిఆత్కూరు ఉపసర్పంచ్
అధికారులు పట్టించుకోవాలి
కోతులు, కుక్కలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు పట్టించుకో వాలి. వాటి బెడద తప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
- నెమలపురి అమ్మారావు (గాంధీ), పరిటాల