టేబుల్ టెన్నిస్ విజేతలు ఎస్‌ఆర్‌జీఈసీ, జేఎన్టీయూ కాకినాడ
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:47 AM
జేఎన్టీయూకే అంతర కళాశాలల టేబుల్‌టెన్నిస్ పోటీలు ఆది, సోమవారాల్లో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల(ఎ్‌సఆర్‌జీఈసీ)లో నిర్వహించారు.
గుడ్లవల్లేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూకే అంతర కళాశాలల టేబుల్‌టెన్నిస్ పోటీలు ఆది, సోమవారాల్లో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల(ఎ్‌సఆర్‌జీఈసీ)లో నిర్వహించారు. మహిళా విభాగంలో మెదటి బహుమతి ఎస్‌ఆర్‌జీఈసీ, ద్వితీయ బహుమతి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల నర్సాపురం, తృతీయ బహుమతి పీవీపీ ఐటీ, వీఆర్ సిద్ధార్థ కళాశాల విజయవాడ కైవశం చేసుకున్నాయని ఎస్‌ఆర్‌జీఈసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణకుమార్ తెలిపారు. పురుషుల విభాగంలో ప్రథమ స్థానం జేఎన్టీయూ కాకినాడ, ద్వితీయస్థానం వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెం, తృతీయస్థానం ఎ్‌సఆర్‌జీఈసీ, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల భీమవరం కైవశం చేసుకున్నాయి. జేఎన్టీయూకే టేబుల్‌టెన్నిస్ టీమ్ మహిళా జట్టుకు ఎస్కే పర్వీన్, ఎ.హెచ్.సంకీర్తన, పి.హర్షిత ఎ్‌సఆర్‌జీఈసీ, డి.సునీత ఎస్‌ఐటీ నర్సాపురం, బి.నిఖిత గాయత్రి విద్యాపరిషత్ విశాఖపట్నం విద్యార్థినులు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో ఏడీ మణికంఠ, డి.శ్యామ్‌సన్ అశోఖ్ యూనివర్సిటీ కళాశాల కాకినాడ, ఎన్.గణేష్ ఎస్వీఈసీ తాడేపల్లిగూడెం, జి.నాగవైభవ్ పొట్టిశ్రీరాములు విజయవాడ, షేక్ అబ్దుల్ రియాన్ నిమ్రా కాలేజ్ విజయవాడ ఎంపికయ్యారని కరుణకుమార్ తెలిపారు. విజేతలకు జేఎన్టీయూకే క్రీడా కార్యదర్శి డాక్టర్ జి.శ్యామ్‌కుమార్, ఎస్‌ఆర్జీఈసీ ప్రిన్సిపాల్ కరుణకుమార్ బహుమతులు ప్రదానం చేశారు.