Share News

సోషల్‌ మీడియా సైకోలపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:41 AM

అవనిగడ్డ వంతెన సెంటర్‌ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌కు వైసీపీ సోషల్‌ మీడియా సైకోలపై టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

సోషల్‌ మీడియా సైకోలపై చర్యలు తీసుకోండి
అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న టీడీపీ, జనసేన నేతలు

అవనిగడ్డ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘జగన్మోహన్‌రెడ్డి అధికారం కోల్పోయినా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ సైకోలు ఇప్ప టికీ తల్లి, చెల్లి తేడా లేకుండా వ్యక్తిత్వ హననం చేస్తూ నీచంగా పోస్టులు పెడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.’ అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో వర్రా రవీంద్రరెడ్డి, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్‌, రాంగోపాల్‌ వర్మ, పంచ్‌ ప్రభా కర్‌, ఇంటూరి రవికిరణ్‌లు సామాజిక మాధ్యమాల్లో పేట్రేగి పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం అవనిగడ్డ వంతెన సెంటర్‌ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌కు వైసీపీ సోషల్‌ మీడియా సైకోలపై ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ పేటీఎం కార్యకర్తలు ఇష్టారీతిన పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్ప డుతున్నారని, వారి ఆగడాల కారణంగా ఎంతో మంది తీవ్ర ఆవేద నకు గురవుతున్నారని, పోలీసులు వారిపై కఠినంగా వ్యవహరించా లని కోరారు. తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు తలశిల స్వర్ణ లత, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి శ్రీనివాసరావు, కూటమి నేతలు యాసం చిట్టిబాబు, గుడివాక శేషుబాబు, మెండు లక్ష్మణరావు, బండే శ్రీనివాసరావు, నడకుదుటి జనార్దనరావు, పైడిపాముల కృష్ణకు మారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:41 AM