Share News

పార్కుల్లో ఆహ్లాదం పెంపునకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:57 AM

నగరంలో పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ డెరెక్టర్‌ హార్టీకల్చర్‌ రామ్మోహన్‌రావు అన్నారు.

పార్కుల్లో ఆహ్లాదం పెంపునకు చర్యలు తీసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీహెచ్‌ రామ్మెహన్‌రావు

చిట్టినగర్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నగరంలో పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ డెరెక్టర్‌ హార్టీకల్చర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పార్కుల ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటైనెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్కుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, మరమ్మతులు, ప్రజలకు అక్కడ కల్పించాల్సిన సదుపాయాలు తదితర విషయాలపై అధికారులు చర్చించారు. గ్రీనరీ, ఆటపరికరాలు తదితర వాటిని సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ (పార్క్సు) చంద్రశేఖర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:57 AM