నూతన క్రీడా విధానంతో ప్రతిభకు పట్టం
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:53 AM
నూతన క్రీడా విధానాలతో ప్రతిభ వెలుగులోకి రానుందని, ఈ అవకాశాలను క్రీడాకారులు అందిపుచ్చుకోవాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
విజయవాడ స్పోర్ట్సు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : నూతన క్రీడా విధానాలతో ప్రతిభ వెలుగులోకి రానుందని, ఈ అవకాశాలను క్రీడాకారులు అందిపుచ్చుకోవాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజుల పాటు సాగే కృష్ణా రీజియన్ పాలిటెక్నిక్ కళాశాలల బాలుర స్పోర్ట్సు, గేమ్స్ మీట్‌ను క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ చదువుతోపాటు క్రీడలకు సమప్రాధాన్యత ఇవ్వా లని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయసారఽథి మాట్లాడుతూ క్రీడలకు తమ కళా శాల ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనంద ంగా ఉందన్నారు. 24పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 650మంది క్రీడాకారులు తలపడుతున్నారన్నారు. తొలిరోజు వాలీబాల్, బాల్‌బ్యాడ్మింటన్, షటిల్, చెస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, అథ్లెటిక్స్ విభాగాల్లో పలు కళాశాలల క్రీడాకారులు ఉత్సాహంగా పోటీపడ్డారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పాలిటెక్నికల్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కమల్ పాషా, ఫిజికల్ డైరెక్టర్ ఎన్.పద్మావతి, ఆర్గనైజర్ సీహెచ్ మధుసూదనరావు పాల్గొన్నారు.