టీడీపీ నేత కారు దగ్ధం
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:44 AM
వాంబేకాల నీలో ఆదివారం తెల్లవారుజా మున తెలుగుయువత సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు కంచి ధనశేఖర్కు చెందిన కారు అగ్నికి ఆహుతి అయింది.
పాయకాపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వాంబేకాల నీలో ఆదివారం తెల్లవారుజా మున తెలుగుయువత సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు కంచి ధనశేఖర్కు చెందిన కారు అగ్నికి ఆహుతి అయింది. నెల రోజుల క్రితం ధనశేఖర్ స్కార్పియో ఎన్ కారును కొనుగోలు చేశారు శని వారం రాత్రి కాలనీలోని తన నివాసానికి సమీపంలో రోడ్డు పక్కన కారును పార్కింగ్ చేసి ఇంట్లో నిద్రించాడు. తెల్లవారు జామున కారుకు మంటలు అంటుకున్నాయని ఫోన్ రావడంతో వెంటనే ఆయన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోపే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో ధనశేఖర్ నున్నరూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా టపాసులు కాల్చితే కారుకు మంటలు అంటుకున్నాయా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.