దేవస్థానం టూ న్యాయస్థానం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:38 AM
తమకు ఉద్యోగ భద్రత కల్పించా లంటూ దేవస్థానం టూ న్యాయస్థానం కార్యక్రమం పేరిట వలంటీర్లు శుక్రవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వలంటీర్ల కార్యక్రమం
ప్రభుత్వ పెద్దల మనసు మారాలంటూ దుర్గగుడిలో వినతిపత్రాల సమర్పణ
స్పందించకపోతే న్యాయస్థానాల మెట్లెక్కుతామని, ఉద్యమిస్తామని హెచ్చరిక
వన్‌టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించా లంటూ దేవస్థానం టూ న్యాయస్థానం కార్యక్రమం పేరిట వలంటీర్లు శుక్రవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంకా గోవిందరాజుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం దగ్గర ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నప్ప టికీ తమ ఉద్యోగ భద్రతపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల మనస్సులను మార్చి తమ న్యాయమైన కోర్కెలు నెరవేరేలా చూడాలని అమ్మ వారిని కోరుతూ అందులో రాశామని వలంటీర్లు తెలిపారు. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వలంటీర్లకు ఉద్యో గభద్రత కల్పిస్తామని, నెలకు రూ.10వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, దానిపై ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, అమ్మవారైనా తమ మొర ఆలకిస్తుం దని, తమ కోర్కె నెరవేరుస్తుందని విన్నవించుకున్నామన్నారు. తమ డిమాండ్లను ఆమోదించాలంటూ దేవస్ధానం టూ న్యాయ స్ధానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోకపోతే త్వరలో న్యాయస్ధానాల మెట్లు ఎక్కుతామని, భారీ సంఖ్యలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.