ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధతపై పునఃసమీక్షించాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:04 AM
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పునఃసమీక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు.
![ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధతపై పునఃసమీక్షించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
ఘంటసాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పునఃసమీక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె జగదీష్ స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట 10 శాతం రిజర్వేషన్లు కల్పించటానికి పార్లమెంట్‌లో 103వ రాజ్యాంగ సవరణ చేసి, చట్టం చేయడం రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులను మించిన విస్తృత ధర్మాసనం ద్వారా విచారించాలని కోరారు. రిజర్వేషన్ల చట్టబద్ధతను పునఃసమీక్షించి, అణగారినవర్గాలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.