Share News

గౌతు లచ్చన్న విగ్రహంపై బురద చల్లడం నీచమైన చర్య

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:51 AM

గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో సర్దార్‌ గౌతు లచ్ఛన్న విగ్రహంపై బురద జల్లడం నీచమైన చర్య అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

గౌతు లచ్చన్న విగ్రహంపై బురద చల్లడం నీచమైన చర్య
నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న బీసీ సంఘం నాయకులు

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌, కొనకళ్ల బుల్లయ్య, బీసీ సంఘం డిమాండ్‌

బంటుమిల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో సర్దార్‌ గౌతు లచ్ఛన్న విగ్రహంపై బురద జల్లడం నీచమైన చర్య అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. లచ్చన్న విగ్రహం, టీడీపీ ఫ్లెక్సీపై బురద జల్లడాన్ని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి, మంచి పనులు చేయడానికి పోటీ పడాలికానీ, బురదజల్లే పనులు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, నిందితులను కఠి నంగా శిక్షించాలని అధికారులను ఆయన కోరారు.

లచ్చన్న ఎందరికో స్ఫూర్తిదాయకం

మచిలీపట్నం టౌన్‌: గుడ్లవల్లేరులో గౌతు లచ్చన్న విగ్రహంపై బురద చల్లిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం రాష్ట్ర నాయ కుడు కొనకళ్ళ బుల్లయ్య డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రైతుల సమస్యలపై పాదయాత్రలు జరిపిన గౌతు లచ్చన్న ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.

బీసీ సంఘం ఆధ్వర్యంలో..

గౌతులచ్చన్న విగ్రహంపై బురద చల్లిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వి.వి.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు ఎవరూ పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాగి చంద్రశేఖర్‌, బోలెం వెంకటేశ్వరరావు, వీరంకి రాము, రాజ్యలక్ష్మి, ఎం.దేవిక, కొండేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పి.సు రేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:51 AM