పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:43 AM
నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలం కింద రెండు సెంట్లు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచ దార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు.
ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు కేటాయించాలి: సీపీఐ
భవానీపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలం కింద రెండు సెంట్లు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచ దార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం 45వ డివి జన్ న్యూభగత్‌సింగ్‌నగర్‌లో స్థలాల కోసం అర్జీలు రాశారు. గత ప్రభు త్వంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా మోసం చేశారని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇళ్లస్థలాల ఇస్తామని ఇచ్చిన హామీతోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నగ రాల్లో పేదలకు రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించాలని దుర్గాంబ కోరారు. పేదలందరికి ఇళ్ల స్థలాలు వచ్చేలా సీపీఐ కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. నాయకులు యర్రసాని జోసెఫ్, అంజూరి సూరిబాబు, అభిషేక్, అభి పాల్గొన్నారు.