ఉద్యాన పంటలకు అపార నష్టం
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:42 AM
ఇటీవల కురిసిన అధిక వర్షాలకు బాపులపాడు మండలంలో ఉద్యాన పంటలకు అపార నష్టం వా టిల్లింది. దాదాపు వారం రోజులు పా టు వర్షం కురవడంతో పాటు మం డలంలో 35 ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయాలు తోటలు, కూరగాయ నర్సరీలకు భారీ నష్టం సంభవించిం ది. మండలంలో కొత్తపల్లి, బిళ్లనపల్లి, మడిచర్ల, అంపాపురం, బొమ్ములూరు గ్రామాల్లో సాగవుతున్న బీర, కాకర, దొండ, బొప్పాయి,మునగ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
హనుమాన్‌జంక్షన్, సెప్టెంబ రు 11 : ఇటీవల కురిసిన అధిక వర్షాలకు బాపులపాడు మండలంలో ఉద్యాన పంటలకు అపార నష్టం వా టిల్లింది. దాదాపు వారం రోజులు పా టు వర్షం కురవడంతో పాటు మం డలంలో 35 ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయాలు తోటలు, కూరగాయ నర్సరీలకు భారీ నష్టం సంభవించిం ది. మండలంలో కొత్తపల్లి, బిళ్లనపల్లి, మడిచర్ల, అంపాపురం, బొమ్ములూరు గ్రామాల్లో సాగవుతున్న బీర, కాకర, దొండ, బొప్పాయి,మునగ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొత్తపల్లి, బిళ్లనపల్లి, మడిచర్ల, అంపాపురం గ్రామాల్లో అధిక వర్షానికి కూరగాయ తోటలు వేరు కుళ్లి మొక్కలు చనిపోయాయి. రామిలేరు వాగు పొంగి జాతీయ రహదారిపై ప్రవహించడంతో బొమ్ములూరు వద్ద రహదారి పక్కనే ఉన్న సూర్య నర్సరీ ముంపునకు గురైంది. నర్సరీలో 30లక్షలు కూరగాయ మొక్కల నారు కుళ్లిపోయింది. దాదాపు రూ.25లక్షలు నష్టం వాటిల్లినట్లు నర్సరీ యజమాని రత్నాకర్ తెలిపారు. అంపాపురంలో గ్రామానికి చెందిన మధుబాబు 10 ఎకరాల్లో సాగు చేసిన మునగ తోట వేరు కుళ్లుతో చనిపోయింది.