Vijayawada: యూటీఎఫ్ ధర్నా.. టీచర్స్ అరెస్టు..
ABN , Publish Date - Jan 09 , 2024 | 10:44 AM
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘలు ఛలో విజయవాడకు పిలుపిచ్చాయి. హమీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు.
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘలు ఛలో విజయవాడకు పిలుపిచ్చాయి. హమీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతీ నెల 1న జీతాలు చెల్లించాలని, రూ 18వేల కోట్లు ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి ఆందోళనకు అనుమతి లేదని టీచర్స్‌ను అడ్డుకున్న పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రతినిధులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తాము గొంతెమ్మ కోరికలు కోరడంలేదని.. ‘‘జగన్ అధికారంలోకి రాకముందు.. గత ప్రభుత్వం ఏదీ ఇవ్వలేదని.. మేము రాగానే పీఆర్సీ ఇస్తాం.. సకాలంలో డీఏలు, రాయితీలు ఇచ్చి.. అన్ని బకాయీలు చెల్లిస్తామని.. ఏ లోటు లేకుండా చేస్తామని చెప్పారు. పీఆర్సీలు, డీఏలు ఇచ్చారు. కానీ పీఆర్సీలు, డీఏలకు సంబంధించిన బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదని’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, ఏపీఎల్‌ఐ నిధులు కూడా ఏడాది కాలంగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. దీనికి సంబంధించి అధికారులు, మంత్రి బొత్స, ఆర్థిక శాఖకు నోటీసు ఇచ్చామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రెండు సార్లు నిరసనలు, ధర్నాలు చేశామన్నారు. ఇప్పుడు 36 గంటల నిరసనలకు పిలుపిచ్చామని, దీనికి పోలీసుల అనుమతి కోరామన్నారు. నిన్నటి వరకు కాలయాపన చేసి.. ఇప్పుడు 144, 30 సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతూ ఎక్కడికక్కడ టీచర్స్‌ను అరెస్టు చేస్తున్నాయని యూటీఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.