Share News

వరద నష్టంపై సమగ్ర పరిశీలన

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:40 AM

కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం పెనమలూరు మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో పర్యటించింది. బృంద సభ్యులు యనమలకుదురు నుంచి పెదపులిపాక దారిలో రైతులు నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి వరదలకు మునిగిన ఇళ్లు, సమగ్ర మంచినీటి పథకానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు.

వరద నష్టంపై సమగ్ర పరిశీలన
యనమలకుదురులో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరిస్తున్న స్థానికులు

పెనమలూరు/ కంకిపాడు, సెప్టెంబరు 11 : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం పెనమలూరు మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో పర్యటించింది. బృంద సభ్యులు యనమలకుదురు నుంచి పెదపులిపాక దారిలో రైతులు నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి వరదలకు మునిగిన ఇళ్లు, సమగ్ర మంచినీటి పథకానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. చోడవరంలో బొప్పా యి, అరటి, కంద లాంటి పంటలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ బాలాజీలు కేంద్ర బృందానికి వరద నష్ట తీవ్రతను వివరించారు. కేంద్ర బృందంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రమణియం, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం చీఫ్‌ ఇంజనీర్‌ రాకేష్‌కుమార్‌, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌వీఎస్‌పీ శర్మ ఉన్నారు. ఫ వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని సీపీఎం నాయకులు కేంద్ర బృందానికి వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఎం నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, కాసిం, మస్తాన్‌వలి, తదితరులు ఉన్నారు. ఫ బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అఽధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్‌, జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గాప్రసాద్‌లు పెదపులిపాక, చోడవరం, రొయ్యూరుల్లో కేంద్ర బృందంతో కలిసి పర్యటించారు. వరదల వల్ల రైతులు నష్టపోయిన పంట వివరాలను, దెబ్బతిన్న గృహాల వివరాలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. రైతాంగానికి పూర్తి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.

ఫ కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, పంచకర్ల రంగారావు, కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజాలు కేంద్ర బృందాన్ని కలిసి ఇటువంటి విపత్తును చూడలేదని, పలు పంట కాలువలు అభివృద్ధి చేయాల్సిన అవసర ముందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజు, తహసీల్దార్‌ భవన్నారా యణ, వ్యవసాయ శాఖ అధికారి పి.ఎం. కిరణ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కోయా ఆనంద్‌, తాడిగడప మునిసిపాలిటి అధ్యక్షు లు అనుమోలు ప్రభాకర్‌, యనదల వెంకటేశ్వ రరావు, రావి అప్పారావు, సర్పంచ్‌ చిప్పల దాసు, వల్లే నరసింహారావు, తీట్ల మధు పాల్గొన్నారు

Updated Date - Sep 12 , 2024 | 12:40 AM