Share News

ఈవీఎంలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Mar 13 , 2024 | 12:49 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలకు పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈవీఎంలను భద్రపరిచే స్టాంగ్‌రూమ్‌లు, ఈవీఎంలు అందజేసే కేంద్రాలను ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మితో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈవీఎంలకు పటిష్ట భద్రత
మార్కెట్‌యార్డులో ఈవీఎం గోడౌన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ అద్నాన్‌

మచిలీపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలకు పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈవీఎంలను భద్రపరిచే స్టాంగ్‌రూమ్‌లు, ఈవీఎంలు అందజేసే కేంద్రాలను ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేసన్‌ విడుదలైన తరువాత జిల్లాకేంద్రంలో ఉన్న ఈవీఎం గూడౌన్‌నుంచి ఆయా నియోజకవర్గాలలో ఎంపికచేసిన స్ర్టాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలను తరలించి భద్రపరుస్తామఅన్నారు. పోలింగ్‌కు ముందు రెండవస్థాయిలో ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఈవీఎంల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. పోలింగ్‌ ముగిశాక ఈవీంలను కౌంటింగ్‌ నిమిత్తం మచిలీపట్నంలోని కృష్ణాయూనివర్సిటీకి అత్యంత భద్రత మధ్య తరలించడం జరుగుతుందన్నారు. పోలింగ్‌ మెటిరియల్‌ పంపిణీ, పోలింగ్‌ తరువాత ఈవీఎంల స్వీకరణ కోసం రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి మాట్లాడుతూ, ఈవీఎంలను భద్రపరిచే స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్టభద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. స్ర్టాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రాంతాలను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎస్పీ ఎస్‌వీడి ప్రసాద్‌, డీఎస్పీలు, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అదికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యటనలో పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2024 | 12:49 AM