Share News

రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీకి ఓటేయండి

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:28 AM

వైసీపీకి ఓటేస్తే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీకి ఓటేయాలని ప్రజలను టీడీపీ-జనసేన-అభ్యర్థి శ్రీరాం తాతయ్య కోరారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీకి ఓటేయండి
జగ్గయ్యపేట డీవీఆర్‌ నగర్‌లో సూపర్‌సిక్స్‌ కరపత్రాలు పంచుతున్న తాతయ్య

టీడీపీ-జనసేన-బీజేపీ జగ్గయ్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, మార్చి 25: వైసీపీకి ఓటేస్తే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీకి ఓటేయాలని ప్రజలను టీడీపీ-జనసేన-అభ్యర్థి శ్రీరాం తాతయ్య కోరారు. సోమవారం పట్టణంలోని డీవీఆర్‌నగర్‌లో టీడీపీ శంఖారావం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చే సే సూపర్‌ సిక్ప్‌ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే కల్పతరువులు అని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గింజుపల్లి రమేష్‌, మైనేని రాధాకృష్ణ, కొల్లి మార్షల్‌ స్టాలిన్‌, మీసాల చిట్టిబాబు, అట్లూరి వెంకటేశ్వరరావు, కల్యాణం మురళి, త్రిపుర్నేని మురళి, చావా చందు, ఇంటూరి రంగనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 01:28 AM