కార్యకర్తలతో మమేకం
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:54 AM
మంత్రి హో దాను మరిచి గురువారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలు, నాయకులతో కలిసి గణేశ్ భవన్‌లో అల్పాహారం తిన్నారు.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మంత్రి హో దాను మరిచి గురువారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలు, నాయకులతో కలిసి గణేశ్ భవన్‌లో అల్పాహారం తిన్నారు. మంత్రి హోటల్‌లో ఉన్నారని తెలిసి ఆయనతో కలసి టిఫిన్ చేసేందుకు పలువురు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆయన ఆప్యాయంగా పలుకరించారు. ఎవరికి ఏది కావాలో అడిగి వారికి అది పెట్టించారు. టీడీపీ నగర అధ్యక్షుడు ఎండీ ఇలియాస్ పాషా పాల్గొన్నారు.