Share News

రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తాం

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:49 AM

రాష్ట్ర అభివృద్ధిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సం ఘాల ఐక్యవేదిక జీఎస్‌డబ్ల్యూఎస్‌గేర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తాం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక

వన్‌టౌన్‌, సెప్టెంబరు 20: రాష్ట్ర అభివృద్ధిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సం ఘాల ఐక్యవేదిక జీఎస్‌డబ్ల్యూఎస్‌గేర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎండీ జానీపాషా, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, వేల్పుల ఆర్లలయ్య, బత్తుల అంకమ్మరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై దయ చూపించి ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించాలని కోరారు. పే స్కేలు మార్పు చేయాలని, ఇంటింటికీ వెళ్లి అందించే సేవల నుంచి తమకు విముక్తి కల్పించాలని, సమాజంలో గౌరవం పెంపొందించే విధులు అప్పగిం చాలని వారు కోరారు. 1.3 లక్షల సచివాలయ ఉద్యోగుల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. 100 రోజుల పాలన పూర్తిచేసిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్య మంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందరిలో స్ఫూర్తి నింపుతు న్నారని పేర్కొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:49 AM