Share News

రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:39 AM

రెవెన్యూ సమస్యలన్నింటిని పరి ష్కరిస్తాం అని, ప్రభుత్వ రాజముద్రతో పాస్‌ పుస్తకాలు ఇస్తున్నాం అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, డిసెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): రెవెన్యూ సమస్యలన్నింటిని పరి ష్కరిస్తాం అని, ప్రభుత్వ రాజముద్రతో పాస్‌ పుస్తకాలు ఇస్తున్నాం అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. 11వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తెలి పారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఉన్న భూ సమస్యలను స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరిం చడానికి ఈ సదస్సులను నిర్వహిస్తున్నామని గద్దె తెలిపారు. ప్రజలు తమ భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా ఈ రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకో వచ్చు నన్నారు. రెవెన్యూ అధికారులు భూ రికార్డులను స్వయంగా పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. నెల రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని వివరించారు. రెవెన్యూ సదస్సులనుద్దేశించి చంద్ర బాబు నాయుడు పంపిన సందేశాన్ని గద్దె రామ్మోహన్‌ చదివి వినిపించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ డి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలన్నింటిని రెవెన్యు సిబ్బంది అందుబాటులో ఉండి పరిష్కరిస్తారన్నారు. ఈ సదస్సులో వచ్చిన అర్జీలను సిబ్బంది సర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. తహసీల్దార్‌ రోహిణిదేవి మాట్లాడుతూ ప్రజలు చెప్పిన సమస్యలను ఆన్‌లైన్‌ చేసి వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. సమస్య చిన్నది అయితే ఇక్కడ వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి గాంధీ, కోనేరు రాజేష్‌, బొలిశెట్టి అన్నపూర్ణ, పాశం సుజాతలు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:39 AM