Share News

కృష్ణాజిల్లా అభివృద్ధికి కృషి చేస్తా

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:39 AM

కృష్ణాజిల్లాకు చెం దిన మంత్రులు, కూటమి నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ముడా చైర్మన్‌ మట్టా ప్రసాద్‌ తెలిపారు.

కృష్ణాజిల్లా అభివృద్ధికి కృషి చేస్తా

ముడా చైర్మన్‌ మట్టా ప్రసాద్‌

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లాకు చెం దిన మంత్రులు, కూటమి నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ముడా చైర్మన్‌ మట్టా ప్రసాద్‌ తెలిపారు. నగరంలోని ముడా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ పదవి ఇచ్చారని, వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం గతంలో ముడా ఆధ్వర్యంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని తెలిపారు. అమరావతికి దగ్గరగా ఉన్న బందరు పోర్టు పూర్తయితే జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. మచిలీపట్నాన్ని పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ముడా పరిధిలోని భూములు, ఇతర ఆస్తులు, అప్పులపై ప్రజలకు జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ముడా కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తామని మట్టా ప్రసాద్‌ తెలిపారు. బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, బొమ్మిడి గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:39 AM