Share News

వరద బాధితులకు అండగా..

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:01 AM

వరద బాధితులకు టీడీపీ ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

వరద బాధితులకు అండగా..
మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు

వన్‌టౌన్‌, సెప్టెంబరు 15: వరద బాధితులకు టీడీపీ ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో మృతిచెందిన 10 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహార చెక్కులను ఆదివారం మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో మృతుల కుటుంబసభ్యులకు ఆయన అందజేశారు. తహసీల్దార్‌ చింతా శిరీషాదేవి, గంటా కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

3 వేల మంది బాధితులకు కుప్పం నుంచి సాయం

వరద బాధితులకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కుప్పం నియోజ కవర్గ ఇన్‌చార్జి పి.ఎస్‌.మునిరత్నం, టీడీపీ కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ కుమార్‌ ఆధ్వర్యంలో తెచ్చిన బక్కెట్లు, మగ్గులు, ప్లేట్లు, దుప్పట్లు, టవల్స్‌, లుంగీలు, నైటీలు, బ్రష్‌లు, సబ్బులు, సర్ఫ్‌ ప్యాకెట్లు, శానిటరీ ప్యాడ్లను సెంట్రల్‌ నియోజకవర్గంలోని 3వేల మందికి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు పంపిణీ చేశారు.

గణపతి సచ్చిదానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో..

టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గం కార్యాలయంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ ట్రస్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 500 మంది వరద బాధితులకు స్టీల్‌ బిందెలు, దుప్పట్లు, చీరలు, కిట్లను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ట్రస్ట్‌ సభ్యులు కేవీ రమణరావు, భాగ్యలక్ష్మి, చింతపల్లి లక్ష్మి, లోకాంబ, మల్లెల శుభప్రభ పాల్గొన్నారు.

కండ్రిక కాలనీలో 2 వేల వస్త్రాల కిట్ల పంపిణీ

సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కండ్రిక కాలనీలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఆయన మిత్రుడు నాల్‌సాఫ్ట్‌ కంపెనీ చైర్మన్‌ నల్లూరి శేషయ్య సమకూర్చిన 2 వేల వస్ర్తాల కిట్లను వరద బాధితులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పట్టాభి రామ్‌, నాల్‌సాఫ్ట్‌ కంపెనీ ప్రతినిధులు పంపిణీ చేశారు. కిట్లలో దుప్పటి, చీర, టవల్స్‌, లుంగీలు అందించారు.

40వ డివిజన్‌లో...

బబ్బూరి గ్రౌండ్‌ కరకట్ట నార్త్‌ వద్ద నివ సిస్తున్న బాధితులకు టీడీపీ 40వ డివిజన్‌ అధ్యక్షుడు పొనుగుపాటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఏపీ పంచాయతీ పరిషత్‌ సంయుక్త కార్యదర్శి గోళ్ల మాల్యాద్రినాయుడు, గుంటూరు బత్తిన ప్రసాద్‌ 200 దుప్పట్లను పంపిణీ చేశారు. గూడురు కొండయ్య, దనేకుల రత్తయ్య, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ పరిషత్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ సింగ్‌ జోడెన్‌, ఏపీ పంచాయతీరాజ్‌ పరిషత్‌ అధ్య క్షుడు జాస్తి వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, గాడు గణేష్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో...

భవానీపురం పోలీస్‌కాలనీ, రామమోహన ఎన్‌క్లేవ్‌లో పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి ఆదేశాలతో బాధితులకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్‌ సిబ్బంది నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు.

ఆర్థిక సాయం అందజేత

కండ్రిక ప్రాంతంలోని వరద బాధితులైన 36 భట్రాజు కుటుంబాలకు ఆది వారం ఆంధ్రప్రదేశ్‌ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో కండ్రికలోని పట్టాభి ఇంటి వద్ద రూ.1,45,000 అందజేశారు. తర్వాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని సంద ర్శించి అక్కడ బాధితుల వివరాలను తెలుసుకున్నారు. కూరపాటి కూటం రాజు, భట్టు మనోహర్‌కుమార్‌, ఏనుగుదాటి రామరాజు, పోరంకి శ్రీనివాస రాజు, చిన కోటంరాజు, లోలబట్టు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:01 AM