Share News

పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:22 AM

పింఛన్‌ రూ. 3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపినట్టైందని, అదే నిజమైన సంక్షేమమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు
గన్నవరంలో పింఛన్‌ నగదు అందిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, జూలై 1: పింఛన్‌ రూ. 3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపినట్టైందని, అదే నిజమైన సంక్షేమమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరంలో సోమవారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. మండలంలో 90శాతంపైగా అందజేసినట్లు ఎంపీడీవో సత్యకుమార్‌ తెలిపారు. వైస్‌ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్‌, సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య, ఉపసర్పంచ్‌ పాలడుగు నాని, టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ తుల్లిమిల్లిఝాన్సీ, మాజీ సర్పంచ్‌ గూడపాటి తులసీమోహన్‌ పాల్గొన్నారు. ముస్తాబాదలో సర్పంచ్‌ వేము రాధాకృష్ణ, పాలడుగు మల్లిఖార్జునరావు, మేడేపల్లి కాంతారావు, బోడపాటి రవి, మేడేపల్లి రమ, క ంచర్ల ఈశ్వరరావు, పాలడుగు రత్నారావు, పలగాని కళ్యాణ్‌, షేక్‌ అభూల్యాజ్‌, చోడవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 01:22 AM