Share News

పనిచేసే ప్రభుత్వమిది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:06 AM

పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉందని, కావలసిన పనులు చేయించుకోవాలని లక్ష్మీనరసింహాపురం సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు.

పనిచేసే ప్రభుత్వమిది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
లక్ష్మీనరసింహాపురం సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉందని, కావలసిన పనులు చేయించుకోవాలని లక్ష్మీనరసింహాపురం సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. భూమి ఉన్న ప్రతీ రైతు రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకోవాలన్నారు. లక్ష్మీనరసింహపురం, ఇలపర్రు పరిధిలో ఎక్కువ శాతం బి-ఫారం భూములే అని, 40 ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నామని ఆ భూములను ఆన్‌లైన్‌లో ఎక్కించి పట్టాలు ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. కలెక్టర్‌ బాలాజీతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, టీడీపీ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, ఎంపీడీవో మల్లీశ్వరి, తహసీల్దార్‌ గురుమూర్తిరెడ్డి, ఈవోపీఆర్డీ అమీర్‌బాషా, గణేష్‌, సర్పంచ్‌ మరియమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 01:06 AM