Share News

Amaravati నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:11 AM

అమరావతి: రాజధాని అమరావతికి శుభారంభం.. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే రూ. 6 వేల 850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి.

Amaravati నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర
AP Capital Amaravati

అమరావతి: ఏపీ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati)కి శుభారంభం.. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ (World Bank) ఆమోదముద్ర వేసింది. రూ. 6 వేల 750 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి గత రాత్రి సమాచారం అందింది. ఇప్పటికే రూ. 6 వేల 850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. హడ్కో నుంచి జర్మన్ బ్యాంక్‌తో కలిపి మరో రూ.16 వేల కోట్లు రుణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హడ్కో పనులకు వెంటనే ప్రభుత్వం టెండర్లుకు పిలవనుంది. సంక్రాంతి తరువాత పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.


కుట్రలు ఛేదించుకుని..

రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్‌ అండ్‌ కో చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ప్రపంచబ్యాంకు రుణం రాకుండా చేసిన కుట్రలన్నిటినీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఛేదించింది. ముమ్మర యత్నాలతో అమరావతి అభివృద్ధికి రుణ మంజూరుకు ఆమోదముద్ర వేయుంచగలిగింది. కొద్ది రోజుల కిందట రూ.6,800 కోట్ల రుణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆమోదించగా.. గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రపంచబ్యాంకు బోర్డు అమరావతి అభివృద్ధికి రూ.6,750 కోట్ల అప్పు ఇవ్వడానికి ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. కానీ ఆ డబ్బు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్‌ అండ్‌ కో ఎన్నో కుట్రలు పన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని.. రుణమిస్తే నీటిపాలవుతుందంటూ పదే పదే ఈ-మెయిల్స్‌ పంపారు. రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. బెదిరించి భయపెట్టి భూములు లాక్కున్నారని చెప్పించారు.


రాజధాని భూముల కొనుగోలులో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ జగన్‌ రోతపత్రికలో విషపు కథనాలు వండి వార్చారు. ఈ పరిణామాలతో ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గింది. తర్వాత కొద్దికాలానికే జగన్‌ సీఎం అయ్యారు. అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. తర్వాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారు. గత ఐదేళ్లలో నిర్మాణ పనులు ఆపేసి అమరావతిని సర్వనాశనం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాజధాని నిర్మాణానికి ఉన్న ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ వస్తున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించేలా చేశారు. తర్వాత ప్రపంచబ్యాంకు, ఏడీబీలను సంప్రదించారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, కేంద్రప్రభుత్వ అధికారులు వారంరోజులపాటు రాజధానిలోనే మకాం వేసి.. వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని రూఢి చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పలు దఫాలు చర్చించాక ఎట్టకేలకు గురువారం రాత్రి బ్యాంకు పాలక బోర్డు అప్పు మంజూరుకు ఆమోదముద్ర వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీలో వర్షాలపై కీలక అప్‌డేట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 20 , 2024 | 07:11 AM