అధ్వానంగా..
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:48 AM
కోడూరు నుంచి విశ్వనాథపల్లి గ్రామానికి వెళ్లే 7.5 కిలోమీటర్ల రహదారి రెండేళ్లుగా అధ్వానంగా ఉంది.
విశ్వనాథపల్లి-కోడూరు రహదారి
మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలకు ఇక్కట్లు
(ఆంధ్రజ్యోతి-కోడూరు): కోడూరు నుంచి విశ్వనాథపల్లి గ్రామానికి వెళ్లే 7.5 కిలోమీటర్ల రహదారి రెండేళ్లుగా అధ్వానంగా ఉంది. విశ్వనాథపల్లి, పిట్టల్లంక, బడేవారిపాలెం, సాలెంపాలెం, వేణుగోపాలపురం గ్రామాల నుంచి కోడూరుకు ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఐదు కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కొంచెం వర్షం పడితే ఆటోలు కూడా తిరగడం లేదు. అడుగడుగునా గుంతలు పడి రాళ్లు తేలటంతో రాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నామని గ్రామ స్థులు చెబతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో పీఆర్ ప్రాజెక్టు రూ.13 లక్షలు మంజూరు చేసి, టెండర్లు పిలిచింది. తర్వాత వాటిని రద్దు చేసింది. నాలుగైదు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావటానికి అవసరమైన రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అవస్థలు పడుతున్నాం
పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, అనారో గ్యంతో అత్యవసర పరిస్థి తుల్లో ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాలన్నా తీవ్ర అవస్థలు పడుతున్నాం. వెంటనే రోడ్డు నిర్మించాలి.
-తాతా గాంధీ, విశ్వనాథపల్లి
కూటమి ప్రభుత్వమైనా నిర్మించాలి
గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం చేపడు తున్నామంటూ, నిధులు విడుదల చేశామని ప్రచారం చేశారు. కానీ పని జరగలేదు. కూటమి ప్రభుత్వమైనా రోడ్డు నిర్మించాలి.
- కొండవీటి యానాది, విశ్వనాథపల్లి