Share News

Pawan Tweet: నీ ఉత్తరం చదివిన వెంటనే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది: పవన్

ABN , Publish Date - Jan 18 , 2024 | 07:43 AM

అమరావతి: ఓ అభిమాని రాసిన లేఖకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ లేఖపై స్పందించిన ఆయ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఐర్లాండ్ దేశంలో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..

Pawan Tweet: నీ ఉత్తరం చదివిన వెంటనే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది: పవన్

అమరావతి: ఓ అభిమాని రాసిన లేఖకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ లేఖపై స్పందించిన ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఐర్లాండ్ దేశంలో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావు.. అంటూ లేఖపై పవన్ కళ్యాణ్ ప్రతి స్పందించారు’’

అభిమాని లేఖలో ఏముందంటే..

"అన్నా.. కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళందరికి నీ మీద ఒక్కటే ఆశ..! ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా..? సరికొత్త గెరిల్లా వార్ ఫెయిర్‌ను మొదలెట్టక పోతావా..? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతామా..? 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వారందరం మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం..

2014 - నిలబడ్డాం

2019 - బలపడ్డాం

2024 - బలంగా కలబడదాం

కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారు మబ్బులు కమ్ముతుంటే.. కార్యోన్ముఖుడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్‌వే కదన్నా..’’ అంటూ అభిమాని పవన్ కల్యాణ్‌కు లేఖ రాశాడు. కాగా గతేడాది డిసెంబర్ 19న ఐర్లాండ్‌ నుంచి అభిమాని ఉత్తరం రాయగా.. తాజాగా అది పవన్‌కు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.

Updated Date - Jan 18 , 2024 | 07:54 AM