Share News

Andhra Pradesh:కొందరు అధికారుల విషయంలో వైసీపీ కన్నీళ్లకు కారణం అదేనా..!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:19 PM

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదేళ్లు తమదే అధికారమని ముందే ఊహించుకుని.. దానికి అనుగుణంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh:కొందరు అధికారుల విషయంలో వైసీపీ కన్నీళ్లకు కారణం అదేనా..!
YS Jagan

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదేళ్లు తమదే అధికారమని ముందే ఊహించుకుని.. దానికి అనుగుణంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల విషయంలో జగన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు గతంలో వినిపించాయి. తమ పార్టీకి అనుకూలంగా ఉండే నేతలకు, జగన్ సొంత సామాజిక వర్గం నేతలకు కీలక పోస్టులు అప్పగించి.. ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టి.. తాను చెప్పినట్లు పనిచేసేలా ఓ కోటరీని ఏర్పాటుచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ అండచూసుకుని అధికారులు సైతం రూల్స్ పక్కనపెట్టి వైసీపీ సేవలో తరించడం మొదలుపెట్టారు. మరోవైపు నిబంధనలు పాటిస్తూ.. నిబద్ధతతో వృతి బాధ్యతలు నిర్వర్తించే అధికారులను పక్కనపెట్టారు. మరికొందరు అధికారులు, ఉద్యోగుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం క్రూరంగానూ వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి.

మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం


వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పులు చేస్తున్న అధికారులను అప్పటి ప్రతిపక్షం టీడీపీ తరచూ హెచ్చరిస్తూనే ఉంది. పార్టీలు శాశ్వతం కాదని.. ప్రభుత్వ అధికారులు తమ పదవీ విరమణ వయసు వచ్చే వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని.. నిబంధనల ప్రకారం పనిచేయాలని టీడీపీ నేతలు అధికారులను హెచ్చరిస్తూ వచ్చారు. అయినాసరే జగన్ చెప్పినట్లే చేస్తూ వైసీపీ భజన చేస్తున్నారనే ముద్ర వేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. దీంతో నిబంధనలు పాటించని అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. నిబంధనలు పాటిస్తూ.. నిజాయితీతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే వారికి పెద్దపీట వేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా.. చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో జగన్ సేవలో తరించిన అధికారులకు కష్టాలు మొదలవ్వడంతో ఆ పార్టీ నేతలు తెగ కన్నీళ్లు కారుస్తున్నారట. దీంతో నిబంధనలు పక్కనపెట్టి వైసీపీ సేవలో తరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు వైసీపీ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు.

టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్


వైసీపీ వెర్షన్ ఇదే..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్న అధికారుల విషయంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కొంత కఠినంగానే వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో ఇతర ఉన్నతస్థాయి అధికారులు నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు వీలుగా ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని.. ఇది పద్ధతి కాదంటూ వైసీపీ నాయకులు కన్నీళ్లు కారుస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పక్కనపెట్టి తమ అధినేత జగన్ చెప్పినట్లు చేసినందుకే అధికారులకు వైసీపీ మద్దతు పలుకుతుందనే ప్రచారం జరుగుతోంది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల విలువలను దిగజార్చేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం వలనే కొందరు అధికారులకు ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసి ఉంటే ఈ విధమైన పరిస్థితులు ఉండి ఉండకపోవచ్చు. కానీ వైసీపీ రాజకీయ కక్షలో అధికారులను పావులుగా వాడుకోవడంతో కొందరు ఐఎఎస్ అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ గత తన పాలనలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిదని కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి జగన్ పాఠాలు నేర్చుకుంటారా.. తన పాత ధోరణితోనే ముందుకెళ్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది.


దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latsets Telugu News

Updated Date - Jun 16 , 2024 | 04:20 PM