Share News

Krishna Lanka Retaining Wall: రిటైనింగ్‌ వాల్‌ ఘనత ఎవరిది..?

ABN , Publish Date - Sep 03 , 2024 | 08:31 AM

కృష్ణలంక రిటైనింగ్ వాల్.. (Krishnalanka Retaining Wall) ఈ నిర్మాణంపై టీడీపీ వర్సెస్‌ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది...

Krishna Lanka Retaining Wall: రిటైనింగ్‌ వాల్‌ ఘనత ఎవరిది..?

  • తొలి దశ నిర్మాణం 2016లో ప్రారంభం

  • 2.37 కిలోమీటర్లు 2018లోనే పూర్తి

  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు, మూడు దశలకు బ్రేక్‌

  • టీడీపీ ఆందోళనలతో ఎట్టకేలకు ఎన్నికలకు ఏడాది ముందు పూర్తి

అమరావతి/విజయవాడ: కృష్ణలంక రిటైనింగ్ వాల్.. (Krishnalanka Retaining Wall) ఈ నిర్మాణంపై టీడీపీ వర్సెస్‌ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఇంతకీ రిటైనింగ్ వాల్ ఘనత ఎవరిది..? పనులు ఏ ఏడాదిలో ప్రారంభించారు..? పూర్తి చేసిందెవరు..? ఎవరి ఒత్తిడితో పూర్తి చేయాల్సి వచ్చింది..? అసలు ఈ వాల్ చరిత్రేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..


retaining-wall-History-2.jpg

ఎవరు.. ఎప్పుడు..?

విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో కృష్ణలంక, రామలింగేశ్వనగర్‌ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి. ఈ రిటైనింగ్‌వాల్‌ ఘనత తమదేనని చెప్పుకునేందుకు వైసీపీ నానా అవస్థలు పడుతోంది. వాస్తవానికి కరకట్ట గోడను టీడీపీ హయాంలోనే సగానికిపైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్‌ నిర్మాణం మూడు ఫేజ్‌లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్‌ 2.37 కి.మీ. యనమలకుదురు నుంచి గీతానగర్‌ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్‌ 1.23 కి.మీ. గీతానగర్‌ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్‌ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్‌ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు తయారు చేయించారు.


retaining-wall-Historys.jpg

టీడీపీ దెబ్బకు..!

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు మంజూరు చేయించి మొదటి దశ (2.37 కి.మీ) నిర్మాణం చేయించింది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ నిర్మాణ పనులను చాలాకాలం ప్రారంభించలేదు. దీంతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కృష్ణానది ఇసుకతిన్నెలలో 2021లో గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. దీంతో దిగి వచ్చిన వైసీపీ సర్కార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏడాది ముందు హడావిడిగా కరకట్ట పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది. పనిలో పనిగా అంచనాలను అదనంగా రూ.50 కోట్లు పెంచి నిర్మాణ పనులు చేపట్టారు. రెండు, మూడో దశ పనులు పూర్తి చేశారు.

retaining-wall-History-33.jpg

Updated Date - Sep 03 , 2024 | 08:31 AM