Home » Telugu Desam Party
YSRCP VS TDP: అనంతపురం జిల్లాల్లో వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన మూకలు కూటమి ప్రభుత్వంలోనూ యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు.
MP Sri Krishna Devarayalu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణలో వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Prathipati Pulla Rao: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటకు అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు.
Marri Rajasekhar: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీపై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజినీని చిలకలూరిపేట ఇన్చార్జ్ని చేశారని మండిపడ్డారు.
Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.
పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.
Minister Ramanaidu: ఏపీని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడుగా చరిత్రలో జగన్ నిలిచిపోయారని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
CM Chandrababu Naidu: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని టీడీపీ నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.
MP Kalisetti Appalanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు.