Share News

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:44 PM

జిల్లా కేంద్రంలని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.బిందు మాధవ్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు.

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ బిందు మాధవ్‌

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం

ఎస్పీ బిందు మాధవ్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.బిందు మాధవ్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాదితులు న్యాయం చేసి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జున రావు, సీఐ శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:44 PM