Share News

రేపటి నుంచి ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:48 AM

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆధార్‌ కార్డులు లేనివారికి, అడ్రస్‌ల మార్పు, అక్షర దోషాలు, తదితర వాటి సవరణకు ఆప్‌డేట్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపటి నుంచి ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు

నంద్యాల టౌన్‌, జూలై 21: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆధార్‌ కార్డులు లేనివారికి, అడ్రస్‌ల మార్పు, అక్షర దోషాలు, తదితర వాటి సవరణకు ఆప్‌డేట్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న 72,793 మందికి, 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలలోపు ఉన్న 75,959 మందికి, 18 సంవత్సరాలు నిండిన వారు 7919 మందికి స్పెషల్‌ డ్రైవ్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

7 బృందాలతో అప్‌డేట్‌ ప్రక్రియ

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 7 బృందాలతో ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియను స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకట బృందం 23వ తేదీన చాంద్‌బడా, 24న బాలాజీ కాంప్లెక్స్‌ శ్రీనివాసనగర్‌, 25న పద్మావతినగర్‌, 26న సరస్వతినగర్‌, 27న రెవెన్యూ క్వాటర్స్‌, గోపాల్‌నగర్‌ ప్రాంతాలకు సంబంధించిన ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియ నిర్వహిస్తుంది. రెండో బృందం 23వ తేదీన ఎన్‌జీవోకాలనీ, 24వ తేదీన పొన్నాపురం, 25న రైతునగరం, 26న ఏకలవ్యానగర్‌, 27న ఎస్‌బీఐ కాలనీలలో నిర్వహిస్తుంది. మూడో బృందం 23వ తేదీన విశ్వనగర్‌, 24న నర్స్‌ క్వార్టర్స్‌, సాయిబాబానగర్‌, 25న దేవనగర్‌, 26న ఆర్‌ఎఫ్‌ రోడ్డు, సాధిక్‌ నగర్‌, 27న విద్యానగర్‌లో క్యాంపు నిర్వహించనున్నారు. నాలుగో బృందం 23న నూనెపల్లి హరిజనవాడ, 24న దేవనగర్‌ మసీదుసెంటర్‌, 25న బర్మషాల, విజయపురికాలనీ, 26న వీసీ కాలనీ, 27న ముల్లాన్‌పేట, 5వ బృందం 23న మూలసాగరం, 24న ఎంఎస్‌నగర్‌, 25న బొమ్మలసత్రం, 26న జ్ఞానాపురం, 27న ఊడుమాల్పురం, 6వ బృందం 23న సలీమ్‌నగర్‌, 24న రామనాధ్‌రెడ్డినగర్‌, 25న పప్పులబట్టి బజార్‌, 26న అనకలపేట, 27న మున్సిపల్‌ ఆఫీస్‌ ప్రాంతంలో క్యాంపు నిర్వహించనున్నారు. 7వ బృందం 23న నందమూరినగర్‌, 24న వైఎస్‌ నగర్‌, 25న రోజాకుంట, 26న తెలుగుపేట, 27న హరిజనవాడ ప్రాంతాల్లోని ఆయా సచివాలయాల పరిధిలో ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియన నిర్వహిస్తారని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Jul 22 , 2024 | 12:48 AM