Share News

టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:30 AM

తెలుగుదేశం సభ్యత్వంతో కార్యకర్తలకు గుర్తింపు, భరోసా ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు

కర్నూలు అర్బన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం సభ్యత్వంతో కార్యకర్తలకు గుర్తింపు, భరోసా ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్‌ఆర్‌పేటలో నిర్వహిం చిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్ర మానికి రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వర రావు యాదవ్‌, నంద్యాల నాగేంద్ర, ఆకెపొగు ప్రభాకర్‌లతో కలిసి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నందమూరి తార క రామారావు తరువాత నారా చంద్ర బాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందు తున్నారన్నారు. ఇప్పటికే 70 లక్షల సభ్యత్వంతో బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. ప్రతి కార్యకర్త చెల్లింంచిన సభ్యత్వ రుసుం మొత్తం తిరిగి కార్యకర్తలకు లబ్ది చేకూరే విధంగా యువనే నారా లోకేష్‌ సరికొత్తగా ఆలోచించి ఇన్సూ రెన్సు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. చనిపోయిన కార్య కర్తలకు గతంలో ఇచ్చిన రూ 2లక్షల పరిహారం రూ. 5 లక్షలకు పెంచారని అన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:30 AM