ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించండి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:39 AM
ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్న ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
పీజీఆర్‌ఎ్‌సకు 195 దరఖాస్తులు
నంద్యాల కల్చరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్న ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ బియాండ్‌ఎ్‌సఎల్‌ఏలో ఉన్న 44 దరఖాస్తులను, సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు 18 మంది అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 195 మంది తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
భూ సేకరణ పూర్తి చేయండి : కలెక్టర్
నంద్యాల కల్చరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరతగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో ప్రగతి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగులో వున్న భూసేకరణను పూర్తి చేసేందుకు ఆర్డీఓలు తహసీల్దార్లతో సమీక్షించి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నందు వల్ల అభివృద్ధికి సంబందించి అన్ని పారామీటర్లలో రాష్ట్రంలో నంద్యాల జిల్లా టాప్‌ఫైవ్‌లో ఉండేలా చూడాలని అన్నారు. దిగువ పది జిల్లాలో ఉంటే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాల్లో మంజూరైన 1026 సీసీ రోడ్ల నిర్మాణాలకు గాను 170 పనులు గ్రౌండ్ అయ్యి 33 పనులు పూర్తయ్యాయని తెలిపారు. అపార్ ఐడీజనరేట్‌కు సంబంధించి విద్యార్ధులు పుట్టిన తేదీ సర్టిఫికెట్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ, డీవీఈవోఓలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటనకు గైర్హాజరైన కొంతమంది జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అందరికీ క్యాన్సర్ పరీక్షలు, క్యాన్సర్‌పై విజయం-స్ర్కీనింగ్‌తో సాధ్యం అనే గోడపత్రికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.