Share News

అమితషాను పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:55 PM

కేంద్ర హోం మంత్రి అమిత షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ కర్నూలు నగర అధ్యక్షుడు షేక్‌ జిలానీ బాషా డిమాండ్‌ చేశారు.

అమితషాను పదవి నుంచి తొలగించాలి
కలెక్టరేట్‌ ముందు నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ కర్నూలు నగర అధ్యక్షుడు షేక్‌ జిలానీ బాషా డిమాండ్‌ చేశారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు సోమవారం అంబేడ్కర్‌ సమ్మాన మార్చ్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా బయలుదేరి అనంతరం కలెక్టర్‌ కార్యా లయం ముందు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం షేక్‌ జిలానీ బాషా మాట్లాడుతూ రాజ్యసభలో అమితషా భారతరత్న అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కార్యక్ర మంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం.కాశీం వలి, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, బజారన్న, జిలానీ, అనంతరత్నం మాదిగ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:55 PM